¡Sorpréndeme!

Avesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP Desam

2025-04-20 3 Dailymotion

2023..ఆర్సీబీ మీద లక్నో మ్యాచ్. లాస్ట్ ఓవర్ 5 పరుగులు కొడితే లక్నోదే విజయం. కానీ అప్పటికే లక్నో బ్యాటర్లంతా అవుటైపోయారు. క్రీజ్ లో ఉన్న రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ లు కష్టపడి ఎలాగోలా చేసి టార్గెట్ పూర్తి చేశారు. లాస్ట్ బాల్ కి సింగిల్ తీస్తే లక్నో గెలుస్తుందంటే అసలు బాల్ బ్యాట్ కి తగలకపోయినా రన్ కి వచ్చేసిన ఆవేశ్ ఖాన్ మ్యాచ్ ను గెలిపించటమే కాకుండా ఒక్క పరుగు కొట్టకుండానే లక్నో విజయానికి కారణమయ్యాడు. అప్పుడు ఆవేశంగా తన హెల్మెట్ తీసి నేలకేసి కొట్టాడు తన అగ్రెషన్ చూపించి తొలిసారి వార్తల్లోకెక్కాడు ఆవేశ్ ఖాన్. ఆ చర్యను ఓవరాక్షన్ గా పరిగణించిన రిఫరీ ఆ మ్యాచ్ లో ఆవేశ్ ఖాన్ ఫీజులో కోత కూడా పెట్టాడు. అయితే రెండేళ్ల క్రితం నెగటివ్ గా ట్రోల్ అయిన అదే ఆవేశ్ ఖాన్ ఇప్పుడు కంప్లీట్ గేమ్ ఛేంజర్ గా మారిపోయాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఉన్న మ్యాచ్ ను చివర్లో రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నో చేతుల్లోకి లాక్కొచ్చేశాడు.  18 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసిన ఆవేశ్ ఖాన్...పరాగ్ ను, జైశ్వాల్ అవుట్ చేశాడు. చివరి ఓవర్ కి రాజస్థాన్ గెలవటానికి 9 పరుగులు చేస్తే చాలన్న టైమ్ లో మళ్లీ బౌలింగ్ కి వచ్చి క్రీజ్ లో ఉన్న ప్రమాదకర హెట్మెయర్ ను అవుట్ చేసి కేవలం 6పరుగులే ఒంటి చేత్తో మ్యాచ్ ను లక్నోకు గెలిచి ఇచ్చాడు ఆవేశ్ ఖాన్. లాస్ట్ బాల్ కి 4 కొడితే రాజస్థాన్ దే విజయం అంటే శుభమ్ దూబే బలంగా బాదిన బాల్ కి తన చేతిని అడ్డం పెట్టేసి వేలు విరగ్గొట్టుకుని మరీ బాల్ ను ఆపాడు. అలా తనకు దెబ్బ తగులుతుందని కూడా లేకుండా ప్రాణం పెట్టేసి ఆడి లక్నో సూపర్ జెయింట్స్ కి ఈ సీజన్ లో మర్చిపోలేని విజయాన్ని అందించాడు.